కాంగ్రెస్ సభలో తొక్కిసలాట...రాహుల్, అఖిలేష్‌ యాదవ్‌కు చేదు అనుభవం

కాంగ్రెస్ సభలో తొక్కిసలాట...రాహుల్, అఖిలేష్‌ యాదవ్‌కు చేదు అనుభవం

న్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ (ఆదివారం) ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌.. ఫుల్‌పూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 

అయితే, ఈ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. వారంతా సభా వేదికను చేరుకోవడానికి ఇటు ఎస్పీ, అటు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలకు సర్దిచెప్పడానికి రాహుల్‌, అఖిలేష్‌ ప్రయత్నించినప్పటికీ వారు వినకపోవడంతో భద్రతా పరమైన సమస్యలు వస్తాయని పోలీసులు హెచ్చరించారు. దీంతో రాహుల్ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌ ప్రసంగించకుండా మధ్యలోనే వెనుదిరిగారు.

Read More Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..