రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి మృతి
విశ్వంభర, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో బుల్లి తెర నటి దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకలోని తమ సొంత గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న వారి వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి, హైదరాబాద్ నుంచి వనపర్తికి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
ఈ ఘటనలో త్రినయని సీరియల్ లో మహిళ విలన్ పాత్ర చేస్తున్న పవిత్ర అక్కడికక్కడే మృతి చెందింగా వారి బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, ఆమె తోటి నటుడు చంద్రకాంత్ (చందు) కు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.