పుష్ప-2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్..!
అల్లు అర్జున్ పుష్ప-2 విడుదలకు ముందు ప్రచార చిత్రాలు, పాటలు, ప్రోమోలతో సినిమాలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ రెండో సాంగ్ ని మే 29న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
అల్లు అర్జున్ పుష్ప-2 విడుదలకు ముందు ప్రచార చిత్రాలు, పాటలు, ప్రోమోలతో సినిమాలో ఆసక్తిని పెంచుతోంది. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమాకు పాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. తొలి పాటతోనే పుష్పకు మించి పుష్ప-2 పాటలు ఉన్నాయంటున్నారు అభిమానులు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్, ఒక పాట విడుదల చేసింది మూవీ టీమ్. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే కేశవా వచ్చి.. ‘‘శ్రీవల్లి వదిన.. పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా.. ఆ పాటేందో చెప్తావా..’’ అని అడగ్గా.. రష్మిక.. ‘‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. ’’అని పాడింది. ఇక ఈ రెండో సాంగ్ ని మే 29న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది అల్లు అర్జున్, రష్మిక కపుల్ సాంగ్ అని తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ అభిమానులు పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప టైటిల్ సాంగ్ రాసిన రైటర్ చంద్రబోస్ ఈ పాటకూ లిరిక్స్ అందించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా తదితర భాషల్లో పుష్ప 2 సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
India ka favourite jodi is back with a banger 💥💥#Pushpa2SecondSingle - 'The Couple Song' announcement video out now 👌🏻
— Mythri Movie Makers (@MythriOfficial) May 23, 2024
▶️ https://t.co/MhaB08SPXg#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/q7a0DI9nWd