పవన్‌తో నాకు పోలికేంటీ.. ఫ్యాన్స్‌పై రేణూదేశాయ్ ఫైర్

పవన్‌తో నాకు పోలికేంటీ.. ఫ్యాన్స్‌పై రేణూదేశాయ్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అతని మాజీ భార్య రేణూదేశాయ్‌కి చెందిన ఏ విషయం అయినా వెంటనే వైరల్ అవుతుంది. ప్రతీ చిన్న విషయం కూడా యూత్‌ని ఆకట్టుకుంటుంది. వీళ్లిద్దరూ విడిపోయి పదేళ్లు దాటినా.. వారి వివాహం, విడాకులు అంశం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేస్తే నెటిజన్లు ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకొని వస్తారు.

 

Read More సినీ పరిశ్రమలో విషాదం – ప్రముఖ నటుడు విజయ్‌ రంగరాజు మృతి

రీసెంట్‌గా రేణూదేశాయ్ చేసిన ఓ పోస్టుపై కూడా పవన్ ఫ్యాన్స్ స్పందించారు. అయితే, ఫ్యాన్స్ కామెంట్స్‌పై రేణూదేశాయ్ ఫైర్ అయ్యారు. రేణుదేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే ఇష్టం. ఆమె జంతువులను చాలా ప్రేమగా చూసుకుంటారు. రీసెంట్‌గా ఆమె తన పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.  

 

Read More సినీ పరిశ్రమలో విషాదం – ప్రముఖ నటుడు విజయ్‌ రంగరాజు మృతి

దీనిపై పవన్ ఫ్యాన్ ఒకరు.. 'మీది కూడా పవన్ కల్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్’ అంటూ కామెంట్ పెట్టారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఏం చేసినా పవన్ కల్యాణ్‌తో పోల్చడం సరికాదని మండిపడ్డారు. తనకు పదేళ్ల వయసు నుంచి జంతువులంటే ప్రేమని ఆమె చెప్పుకొచ్చారు. కానీ.. పవన్ కల్యాణ్ యానిమల్ లవర్ కాదని జవాబిచ్చారు. తన జీవితంలో లేని వారితో కంపేర్ చేసి ఎందుకు ఇబ్బంది పెడతారని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా నెటిజన్ పెట్టిన ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి మళ్లీ పోస్టు చేశారు. ఇలాంటి కామెంట్స్ బాధ, ఆవేదన కలిగిస్తాయని ఆమె రాసుకొచ్చారు.

Related Posts