‘ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక మందన్న కామెంట్స్ వైరల్

‘ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక మందన్న కామెంట్స్ వైరల్

రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచారు.

రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచారు. అయితే, ఈ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్‌గానే కాకుండా వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. 

అయితే, ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న గం గం గణేశా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రష్మిక హాజరైంది. ఈవెంట్‌లో ఆనంద్‌ దేవరకొండ యాంకర్‌గా మారి.. రష్మికను మీ ఫేవరేట్‌ కోస్టార్ ఎవరని అడిగాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే ప్రేక్షకులంతా రౌడీ బాయ్‌ అంటూ కేకలు వేశారు. 

Read More ఫాదర్స్ డే.. చిరంజీవి, అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్స్

దీంతో రష్మిక కొంచెం కోపంతో నవ్వుతూ.. ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా నన్ను స్పాట్‌లో పెట్టేస్తే ఎలా అని ఫన్నీగా సమాధానం ఇచ్చింది. కాగా, రష్మిక చివరికి విజయ్‌ దేవరకొండ పేరు చెప్పడంతో ఈవెంట్‌ అంతా అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.