‘తమ్ముడు’ రీరిలీజ్.. థియేటర్లో పవన్ ఫ్యాన్స్ రచ్చ

‘తమ్ముడు’ రీరిలీజ్.. థియేటర్లో పవన్ ఫ్యాన్స్ రచ్చ

  • పవన్ డిప్యూటీ సీఎం కావడంతో జోష్‌లో ఫ్యాన్స్
  • రీరిలీజ్ సినిమా సందర్భంగా థియేటర్ల వద్ద సందడి

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచిన మాస్, కమర్షియల్, క్లాసిక్ అనే తేడాలేకుండా ఒకదానితర్వాత ఒకటి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు.. రీరిలీజ్ సినిమాలకు హౌస్‌ఫుల్ కలెక్షన్లు వస్తుండటంతో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమా విడుదలై 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేశారు మేకర్స్. ఇంకేముంది ఇప్పటికే ఏపీలో జనసేన ఊహించని విజయం సాధించడం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

Read More ‘ది కేరళ స్టోరీ-2’  ప్రదర్శనను నిలిపివేయాలి 

ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఈ సినిమా రిలీజ్‌ సందర్భంగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ షోలు వేసినా బుక్ మై షో లో మొత్తం మీద 5.5 వేల టికెట్ సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.

 

Related Posts