పెళ్లిపై పోస్ట్ చేసిన నివేదా థామస్.. ఎప్పుడంటే..?
గ్లామర్ ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయడంలో నివేదా థామస్ ముందు వరుసలో ఉంటుంది. రెండేండ్ల క్రితం శాకిని డాకిని’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది నివేదా థామస్. అందులో పోలీస్ ట్రెనింగ్ పాత్రలో ప్రేక్షులను ఆకట్టుకుంది. కామెడీ చేస్తూ నవ్వించింది.
అలా కొద్ది రోజుల తర్వత ఏం జరిగిందో తెలియదు కానీ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. అంతే కాకుండా ఏ భాషల్లో కూడా కనిపించడం లేదు. దాంతో ఫ్యాన్స్ అందరూ ఫీలయ్యారు. అదే సందర్భంలో ఒక్క పోస్ట్‌తో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్లు ముందున్నారు. చాలా వరకు హీరోయిన్లు కుటుంబం వేరు, సినిమా వేరు అని భావించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు నివేదా థామస్ కూడా పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన స్టోరినే. ఆ స్టోరి చూసి నివేదా థామస్ కి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో మారుమోగుతుంది.
ఇన్‌స్టాగ్రామ్ లో నివేదా థామస్.. ‘చాలాకాలం అయ్యింది. కానీ ఫైనల్‌గా.. అంటూ స్టోరీని షేర్ చేసింది. ఈ స్టోరికి ఒక లవ్ ఎమోజీ ని యాడ్ చేసింది. దాంతో తన పెళ్లికి సంబంధించిన వార్త అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అసలు విషయం అది కాదు. రానా దగ్గుబాటి సమర్ఫణలో ఒక మూవీని సైన్ చేసింది. ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్‌ను షేర్ చేసింది నివేదా థామస్.