కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టిన హీరో నితిన్

కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టిన హీరో నితిన్

  • ఆల్రెడీ సితార పేరుతో ఒక థియేటర్
  • ఏషియన్‌ గ్రూప్స్‌తో మల్టీఫ్లెక్స్ ప్లాన్‌

సినీ ఇండస్ట్రీ రంగుల ప్రపంచం లాంటిది. ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో.. ఎప్పుడు ఫెయిల్యూర్ వస్తుందో చెప్పలేం. దీంతో హీరో, హీరోయిన్లు అటు సినిమాలు చేస్తూనే వ్యాపారం వైపు దృష్టి పెడుతున్నారు. వరుస సినిమాలు చేస్తూనే కొత్త వ్యాపారాలను మొదలు పెట్టి సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. తాజాగా యంగ్ హీరో నితిన్ అదే బాటను ఎంచుకున్నాడు. 

అయితే, ఈ హీరో మల్టీప్లెక్స్ బిజినెస్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నితిన్ ఏషియన్ సంస్థతో కలిసి ఏఎన్ఎస్‌ అనే మల్టీఫ్లెక్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. నితిన్‌కు ఇదివరకే సితార పేరుతో ఒక థియేటర్ ఉంది.. ప్రస్తుతం ఈ థియేటర్‌ను రేనోవేషన్ చేస్తున్నారు. 

అయితే ఇదే థియేటర్‌ను ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మల్టీఫ్లెక్స్‌కు ఏసియన్ సితార మల్టీ ఫ్లెక్స్ అనే పేరు పెడుతున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే నితిన్ క్లారిటి ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే. ప్రస్తుతం నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ అనే సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

Related Posts