‘బుజ్జి’ని నడిపిన నాగచైతన్య.. వీడియో వైరల్..!

‘బుజ్జి’ని నడిపిన నాగచైతన్య.. వీడియో వైరల్..!

స్పోర్ట్స్ కార్లను ఎంతగానో ఇష్టపడే చై బుజ్జిని చూసి ఆశ్చర్యపోయాడు. రేసింగ్ ట్రాక్ లో ఈ సూపర్ కార్ తో దూసుకొనివెళ్లారు. దీనికి సంబంధించి వీడియోను కల్కి మేకర్స్ ట్విట్టర్ లో షేర్ చేసారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం “కల్కి 2898 AD’’ విడుదలకు ముందే ప్రచారంతో హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ పాన్ వరల్డ్ సినిమాలో ప్రభాస్ ఉపయోగించే వాహనాన్ని మేకర్స్ ‘బుజ్జి’గా పరిచయం చేసిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అయిన బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారు. బుజ్జిని నడుపుతూ ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు కేరింతలతో ఆ ఈవెంట్ సక్సెస్ అయింది. ప్రభాస్ లుక్ ఇదివరకటి కంటే మెరుగవడం, బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

అయితే బుజ్జిని తాజా హీరో అక్కినేని నాగచైతన్య నడిపారు. స్పోర్ట్స్ కార్లను ఎంతగానో ఇష్టపడే చై బుజ్జిని చూసి ఆశ్చర్యపోయాడు. రేసింగ్ ట్రాక్ లో ఈ సూపర్ కార్ తో దూసుకొనివెళ్లారు. దీనికి సంబంధించి వీడియోను కల్కి మేకర్స్ ట్విట్టర్ లో షేర్ చేసారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Tags:

Related Posts