ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘కల్కి’ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘కల్కి’ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’ ఒక‌టి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుంది.

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’ ఒక‌టి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుంది. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రభాస్ అభిమానులు ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ‘కల్కి 2898AD’ ట్రైలర్‌ను జూన్ 10వ తేదీన విడుద‌ల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పనిలో పనిగా దీపికా ప‌దుకొనే కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేవిధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేయ‌నున్నారు.

 

Related Posts