ప్రభాస్ ‘కల్కి 2898AD’ సినిమాపై బిగ్‌బీ ప్రశంసలు..!
'కల్కి 2898' చిత్రంపై అమితాబ్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుత ఆలోచనాశక్తి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ రిలీజ్ చేసిన అశ్వద్ధామ గ్లింప్స్‌కు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అద్భుతమైన యాక్టింగ్‌తో అమితాబ్ అదరగొట్టారు. “కల్కి 2898 AD ” సినిమాను జూన్ 27న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలో ప్రభాస్ ఉపయోగించే వాహనానికి 'బుజ్జి' అనే పేరు పెట్టి ఓ సెపరేట్ క్యారెక్టర్‌ను మేకర్స్ తీర్చిదిద్దిన విషయం తెలిసిందే.
బుజ్జి ఒక రోబోట్ కార్. అలాగే ఈ సినిమాలో ప్రభాస్‌కు క్లోజ్ ఫ్రెండ్. ఈ బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. ఇదిలా ఉంటే 'కల్కి 2898' చిత్రంపై అమితాబ్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుత ఆలోచనాశక్తి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలోనే కల్కి మూవీ భారీ విజయం సాధిస్తుందనే భావన కలిగిందని తెలిపారు. ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఒక అద్భుతమని అమితాబ్ తెలిపారు.