‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత 

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత 

జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బ‌లగం’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది.

జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బ‌లగం’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అంద‌రినీ ఏడిపించిన విష‌యం తెలిసిందే. బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య దంప‌తులు పాడిన ఈ పాట తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కన్నీళ్లు పెట్టించింది. అయితే ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. 

ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను వరంగల్‌లోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. మొగిలయ్య కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇక మొగిలయ్య ప్రాణాలను కాపాడాల‌ని, త‌మ‌ని ఆదుకోవాల‌ని ఆయ‌న‌ భార్య కొముర‌మ్మ ప్ర‌భుత్వాన్ని వేడుకుంది. ఇదివరకే మొగిలయ్య అనారోగ్యానికి గురి కాగా మెగాస్టార్ చిరంజీవి సాయమందించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మొగిలయ్యను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ తరుణంలోనే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బలగం మొగిలయ్య భార్య కోరింది. ఎవరైనా సాయం చేయాలని వేడుకుంది.

Read More  మైసూర్ మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో వాల్గో ఇన్‌ఫ్రా 5G , డేటా సేవలను ప్రారంభించిన సీఎం సిద్ధరామయ్య