Viral: సింపుల్‌గా హైవే పక్కన దాబాలో అల్లు అర్జున్ దంపతుల భోజనం..!

Viral: సింపుల్‌గా హైవే పక్కన దాబాలో అల్లు అర్జున్ దంపతుల భోజనం..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ఫొటో నెటింట వైరల్ అవుతోంది. బన్నీ దంపతులు దాబాలో భోజనం చేస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. అయితే బన్నీ దంపతులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతంలో ఈ దాబా అనే విషయాలకు సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలియదు.

సెలబ్రిటీలు సాధారణ వ్యక్తుల మాదిరి వివిధ ప్రాంతాల్లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ఫొటో నెటింట వైరల్ అవుతోంది. బన్నీ దంపతులు దాబాలో భోజనం చేస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. అయితే బన్నీ దంపతులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతంలో ఈ దాబా అనే విషయాలకు సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలియదు.

బన్నీ ఫోన్ లో మాట్లాడుతుండగా పక్కనే స్నేహరెడ్డి భోజనం చేస్తూ కనిపించారు. పాన్ ఇండియా స్టాయ్ అయ్యుండీ దాబాలో సింపుల్‌గా భోజనం చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడి సింప్లిసిటీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు.

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా కూడా బన్నీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ దెబ్బకు అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. ఇక ఆ సినిమా ఇచ్చిన హైప్ తో పుష్ప-2 కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2  సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ అందరిలో అంచనాలను పెంచేసింది.

Related Posts