త్యాగానికి గుర్తుగా పీర్ల పండుగ - ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
పీర్లపండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించాలి.
On
విశ్వంభర, హైదరాబాద్ ; హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మొహరం పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం రాష్ట్రస్థాయి సభ జరిగింది. టి ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తలుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం , మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ , ప్రముఖ రచయిత కవులు మాస్టర్ జి , టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ , మొహరం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టన్న, శ్రీధర్ , సాజిదా సికందర్ పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ త్యాగాలకు కులం మతం ఉండదని, ప్రాంతీయత ఉండదని, ఎవరు త్యాగాలు చేసినా కీర్తించడం తెలంగాణ వారసత్వ సంస్కృతి అన్నారు. భూమి కోసం ఆ భూమి కొరకు పోరాడుతున్న ప్రజల కొరకు ప్రాణమిచ్చినారు వారిని వారి త్యాగానికి గుర్తుగా పీర్ల పండుగ నిర్వహించుకోవడం తెలంగాణలో ఆనవాయితీ అన్నారు. పీర్ల పండుగకు సెలవు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వాలు సంపూర్ణంగా సహకరించాలని అందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పట్లో అనే ప్రజలు కలిసి మారుతి పీర్ల పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఐక్యతతోనే ఏ డిమాండ్ అయిన సాధించబడుతుందని పీర్ల పండుగ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.



