తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

విశ్వంభర, రాజన్న సిరిసిల్ల:-  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి పట్టణ సీఐ కృష్ణ పాల్గొన్నారు. వారికి బంజారా మహిళలు గోధుమ మొలకలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ తీజ్ పండుగలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ పండగ యావత్ సమాజం బాగుకోసం చేసే పవిత్రమైందని అన్నారు. తీజ్ పండుగ సాంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బంజారాలు అత్యున్నత అభివృద్ధిలోకి వస్తారని అన్నారు.

Tags: