తీవ్ర విషాదం: పపువా న్యూగినియాలో 670 దాటిన మృతుల సంఖ్య!
పసిఫిక్ ద్వీప దేశమైన పపువా న్యూగినియాలోని ఓ గ్రామంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ అంచనా వేసింది.

శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని యూఎన్ మైగ్రేషన్ ఏజెన్సీ మిషన్ చీఫ్ సెర్హన్ అక్టోప్రాక్ తెలిపారు. అంతకుముందు అక్కడి స్థానిక అధికారులు 100 మందికి పైగా చనిపోయారని వెల్లడించారు. అయితే, తాజాగా మృతుల సంఖ్య 670 దాటి ఉంటుందని అధికారులు చెప్పడం విచారం కలిగిస్తోంది.
మరోవైపు ఆదివారం నాటికి కేవలం ఐదు మృతదేహాలు, ఆరో మృతదేహానికి సంబంధించిన ఓ కాలును మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అక్టోప్రాక్ తెలిపారు.