గణేష్ మాత డివోషనల్ ఆధ్వర్యంలో అన్నదానం
విశ్వంభర, లలితా బాగ్ పటేల్ నగర్ :- గణేష్ మాత డివోషనల్ మండపం లలితా బాగ్,పటేల్ నగర్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు మణికుమార్ మాట్లాడుతూ 2005 నుండి గణేష్ మండపాన్ని నెల కొ లుపుతున్నామని 2019 నుండి దుర్గామాత మండపాన్ని కూడా నెలకొల్పుతున్నామని బస్తీ వాసుల సహాయ సహకారాలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సాయంత్రం కుంకుమార్చన, అన్న ప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు, పల్లకి సేవ, సప్త హారతి, చండీ హోమం, బతుకమ్మ, దాండియా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈసారి అమ్మవారిని అలంపూర్ జోగులాంబ కు బస్తీ వాసులమంతా కలిసి నిమజ్జన కార్యక్రమానికి తరలి వెళ్తున్నామని తెలిపారు. సభ్యులు శివకుమార్, సాయినాథ్ కుమార్,అభిషేక్, కిషోర్, ఆదిత్య కిరణ్, పి శ్రీనివాస్, రాఘవేంద్రరావు, ఆర్ శ్రీనివాస్ పి సతీష్ కుమార్ రోహిత్, బి దిలీప్, సందీప్, రమేష్, మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామని తెలిపారు.



