కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
On
విశ్వంభర, సూర్యాపేట : తెలంగాణలో గత 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కేవలం అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతి సాధిస్తుందనీ అన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమయ్యాయి. కమిషన్ అనేది చాలా సాధారణమైన పదం అయిపోయిందనీ అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎట్లా పోటీ పడుతున్నారనేది ప్రజల్లో చర్చ జరిగే స్థాయిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని అన్నారు.