ఎన్నికలు పూర్తి.. కిక్కిరిసిన మెట్రో.. నేడు అదనపు సేవలు!

ఎన్నికలు పూర్తి.. కిక్కిరిసిన మెట్రో.. నేడు అదనపు సేవలు!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు సజావుగా పూర్తి అయ్యాయి. అయితే హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు సజావుగా పూర్తి అయ్యాయి. అయితే హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటు హక్కు వినియోగించుకున్న వారందరూ కూడా వెంటనే హైదరాబాద్ తిరుగు పయనం అయ్యారు. ఇలా ఓటర్లందరూ కూడా తిరిగి హైదరాబాద్ వెళ్లడంతో రహదారులన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయాయి. 

 

Read More కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్

ఇక ఓటర్లందరూ కూడా ఓటు వేసిన వెంటనే హైదరాబాద్ రావడంతో హైదరాబాద్ కూడా రద్దీగా మారిపోయింది. ఎక్కువ ట్రాఫిక్ జామ్ కావడంతో హైదరాబాద్ చేరుకున్నటువంటి పలువురు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం కోసం మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో కూడా కిక్కిరిసిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా విజయవాడ నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ రద్దీగా మారిపోయింది. 

 

Read More కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్

ఇలా ప్రయాణికులు ఎక్కువగా మెట్రోని ఆశ్రయించడంతో ప్రతిరోజు ఆరు గంటలకు ప్రారంభం అయ్యే మెట్రో సేవలు నేడు అరగంట ముందే అనగా 5:30 కి ప్రారంభం అయ్యాయి. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకున్నటువంటి మెట్రో సంస్థలు అదనంగా మెట్రో సేవలను అందించబోతున్నట్లు వెల్లడించారు.