ఎమ్మెల్యే శివకూమర్ కు ఈసీ షాక్​…

ఎమ్మెల్యే శివకూమర్ కు ఈసీ షాక్​…

విశ్వంభర, వెబ్ డెస్క్ : ఓటర్ పై దాడి చేసిన తెనాలి ఎమ్మెల్యే శివకూమర్ పై ఈసీ చర్యలు తీసుకుంది. వెంటనే అదుపులోకి తీసుకుని, పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఎలక్షన్​ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఎమ్మెల్యే శివకుమార్ క్యూలో నిలబడకుండా డైరెక్టగా పోలింగ్ బూత్​ లోకి ప్రవేశిస్తుంగా ఓ ఓటరు ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఓటర్ పై చేయి చేసుకున్నాడు.

వెంటనే ఓటర్ ఎమ్మెల్యే చెంప చెల్ మనిపించాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ పై దాడి చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా పలువురు నెటిజన్లు ఎమ్మెల్యే పై యాక్షన్ తీసుకోవాలిసిందిగా కోరారు. ఇది ఇలా ఉంటే వాతావరణం అనుకూలించడంతో వృద్ధులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గతం కంటే ప్రస్తుతం పోలింగ్ పర్సంటేజ్ మెరుగ్గా ఉందని ఈసీ వెల్లడించింది.

Read More Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..