నదిలో దూకిన ప్రేమజంట.. కాపాడి చెంప చెల్లుమనిపించిన మత్స్యకారుడు
- గోమతి నదిలో దూకిన ప్రేమికులు
- పనికిమాలిన పనిచేశావంటూ మందలించిన మత్స్యకారుడు
- ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఘటన
ఓ ప్రేమజంట నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్నమత్స్యకారులు గమనించి వెంటనే అప్రమత్తమై వారిని కాపాడారు. ఒడ్డుకు వచ్చాక ప్రియుడిని పనికిమాలిన పని చేశావంటూ మత్స్యకారుడు చెంప చెల్లుమనిపించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఓ ప్రేమ జంట గోమతి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అది చూసి అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు. అనంతరం ప్రియుడి చెంప చెల్లుమనిపించాడు ఓ మత్స్యకారుడు. నువ్వు చేసింది పనికిమాలిన పని అంటూ మందలించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ వీడియోలో మత్స్యకారులు తమ ప్రాణాలను తెగించి ప్రేమజంటను రక్షించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
आत्महत्या करने गोमती नदी में कूदे युवक को पहले मछुआरे ने बचाया
— Priya singh (@priyarajputlive) June 15, 2024
उसके बाद थप्पड़ों से पीटा।
2 दिन पहले भी यह युवक गोमती नदी में छलांग लगा चुका था.
यूपी के सुल्तानपुर का मामला pic.twitter.com/k0bbkvHHkk