కలెక్టర్ పేరులో ఫేస్‌బుక్ నకిలీ ఖాతా.. డబ్బులు వసూలు..!

కలెక్టర్ పేరులో ఫేస్‌బుక్ నకిలీ ఖాతా.. డబ్బులు వసూలు..!

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేర్లు, ఫొటోలతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను తెరిచి అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను సృష్టించారు కేటుగాళ్లు.

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేర్లు, ఫొటోలతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను తెరిచి అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను సృష్టించారు కేటుగాళ్లు. ఈ విషయమై కలెక్టర్ ప్రావీణ్య పోలీసులకు ఇవాళ (గురువారం) ఫిర్యాదు చేశారు. 

దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ప్రావీణ్య పేరుతో సృష్టించిన నకిలీ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులను వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీలంక (+94776414080)కు చెందిన నెంబర్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని కలెక్టర్ కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More పీర్ల పండుగకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కృషి చేస్తా -  మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్-  ఉబేదుల్లా  కొత్వాల్  

ఇదిలా ఉండగా రెండు రోజుల కిందట తెలంగాణ డీజీపీ రవి గుప్తా పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ‘రూ.50వేలు ఇస్తే.. నిన్ను కేసు నుంచి తప్పిస్తాం’ అంటూ నమ్మిస్తూ హైదరాబాద్‌లోని ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేశాడు అగంతకుడు. అతడి కూతురుకు సైతం ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. ముందుగా వారిని మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు డిమాండ్ చేశారు. దుండగుడు చేసిన వాట్సాప్ కాల్ +92 కోడ్‌తో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెంబరు పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు తేల్చారు.