బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు 

బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు 

  • గోల్డ్ స్కీమ్ పేరుతో మోసగించారని ఆరోపణ
  • శిల్పా, ఆమె భర్తపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు నమోదైంది. గోల్డ్ స్కీమ్ పేరుతో తనను మోసగించారని ఓ వ్యాపారి కోర్టులో ఫిర్యాదు చేశాడు. సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్స్ శిల్పా, రాజ్‌కుంద్రాతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లు, మరో ఉద్యోగి మోసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విచారణ చేపట్టిన ముంబై అదనపు సెషన్స్ కోర్టు శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త రాజ్‌కుంద్రాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను జడ్జికి చూపడంతో కేసు నమోదుకు ఆదేశించారు. 2014లో రాజ్‌ కుంద్రా, శిల్పా శెట్టిలకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఐదేళ్లకు సంబంధించిన ఓ గోల్డ్ స్కీమ్ ప్రకటించింది. అందులో భాగంగా రూ.18.58 లక్షలకు తాను కిలో బంగారం కొనుగోలు చేశానని సదరు వ్యక్తి పోలీసులకు వివరించారు. దీనికి ఆధారంగా తనకు ఒక గోల్డ్ కార్ట్ కూడా ఇచ్చారని అతడు ఆరోపించాడు. సదరు జోషి టర్మ్ ప్లాన్ 2019 మార్చి 25న ముగిసినప్పటికీ వారు చెప్పినట్లు బంగారం ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Read More పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ హెచ్చరిక

Related Posts

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు