ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం..!

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం..!

  • ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉండగా బాంబ్ బెదిరింపు కాల్ 
  • ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ప్రయాణికులంతా సురక్షితం

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉదయం 5.35కు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చినట్లు విమాన సిబ్బంది తెలిపారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉండగా బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికులను కిందికి దించేశారు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌తో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఏవియేషన్‌ సెక్యూరిటీ, బాంబ్‌ డిస్పోజబుల్‌ టీమ్‌ తనిఖీలు చేపడుతోంది. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఐసోలేషన్‌ బేకు తరలించారు. కాగా గత కొని రోజులుగా దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపు కాల్స్, మెయిల్ వస్తున్న విషయం తెలిసిందే.  విమానాన్ని తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More అలిపిరి నడకమార్గంలో.. త్వరలో దివ్యదర్శనం టోకెన్ల జారీ - తితిదే ఈవో శ్యామలరావు

Related Posts