Attack on couple: అమానుషం.. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని దంపతులపై దాడి..!

Attack on couple: అమానుషం.. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని దంపతులపై దాడి..!

నగరంలోని మధురానగర్‌ పరిధి రహమత్ నగర్‌లో నివాసముంటున్న శ్రీనాథ్ ఇంట్లోని పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

చిన్నపాటి కారణాలకే గొడవలకు దిగుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పాతకక్షను మనసులో పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. పెంపుడుకుక్క ఇంట్లో చొరబడిందని ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి దంపతులపై దాడికి తెగబడ్డాడు. 

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని మధురానగర్‌ పరిధి రహమత్ నగర్‌లో నివాసముంటున్న శ్రీనాథ్ ఇంట్లోని పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న ధనుంజయ్ అదను చూసి తన స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌తో పాటు అతడి భార్యపై దాడికి దిగాడు. 

Read More రామ్ నివాస్ పానీపూరి సాండ్విచ్ చాట్. ప్రారంభం. 

కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌, అతడి భార్య, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు.