కొత్తగూడెం తీవ్ర విషాదం.. ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి

కొత్తగూడెం తీవ్ర విషాదం.. ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలం సాంబాయిగూడెంలో కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. సాంబాయిగూడెంలో సాయి కుమార్‌, లిఖిత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కల్మిష అనే మూడేళ్ల పాప ఉంది. నిన్న సాయంత్రం కల్మిష ఆడుకుంటూ బయటకు వచ్చింది. ఆ సమయంలో లిఖిత నిద్రపోతుంది. కల్మిషతో పాటు చాలా మంది చిన్నారులు ఆడుకుంటున్నారు. 

 

Read More నెక్లెస్ రోడ్ లో "రన్ ఫర్ క్వాలిటీ" రన్నింగ్ పోటీలను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

అయితే.. కల్మిష ఆడుకుంటూ అక్కడే ఉన్న ఓ కారు ఎక్కింది. సడెన్‌గా కారు డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి. కల్మిషతో ఆడుకుంటున్న పిల్లలు అంతా చిన్నారులే కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. కల్మిష పిల్లలను చూస్తూ ఏడుస్తూనే ఉంది. కాసేపటికి కల్మిష స్పృహ తప్పి కారులోనే పడిపోయింది. సాయంత్రం సమయంలో గాలి దుమారం రావడంతో లిఖిత పాప కోసం బయటకు వచ్చింది. కానీ.. పాప మాత్రం కనిపించలేదు. 

 

Read More నెక్లెస్ రోడ్ లో "రన్ ఫర్ క్వాలిటీ" రన్నింగ్ పోటీలను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

గాలి రావడంతో అక్కడే ఆడుకున్న పిల్లలు కూడా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. లిఖిత పాప కోసం చుట్టుపక్కల వెతికింది. ఇంతలో కారులో స్పృహ తప్పిన కల్మిష కనబడింది. కారు లాక్‌ తీసిన లిఖత, సాయి కుమార్‌ పాపను ఆస్పత్రి తీసుకొని వెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో స్థానికంగా విషాద చాయలు నెలకొన్నాయి.

Tags: