బంగారు తెలంగాణ దిక్సూచి కేటీఆర్: అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి.
విశ్వంభర, మీర్ పెట్ : బంగారు తెలంగాణ దిక్సూచి కేటీఆర్ అని మీర్పేట్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మీర్పేట్ జూనియర్ కళాశాలలో నోటుబుక్కులు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిక్షనరీ, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కామేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ప్రగతి పదం చూపిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు లక్ష్మీ నరసింహ రెడ్డి, జనరల్ సెక్రటరీ శీను నాయక్,మహిళా అధ్యక్షురాలు సునీత, విజయలక్ష్మి,సీనియర్ నాయకులు సిద్దాల బీరప్ప, దీప్‌లాల్ చౌహన్, సుదర్శన్ రెడ్డి, నరసింహారెడ్డి, చారి, దయానంద్ ముదిరాజ్, శేఖర్ గౌడ్,ప్రభాకర్ రెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, గోపి యాదవ్, పంతంగి మాధవి, శేఖర్ రెడ్డి, బిందు, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



