Viral Video: ‘జగనన్నను సీఎం చేయాలి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటా’
ఓ యువకుడు జగన్ ఓటమిపై విచారణ జరపాలని, జగన్‌ను మళ్లీ సీఎంను చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తన భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. నికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే జగన్ ఓటమిని ఆ పార్టీ నేతలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో ఓ యువకుడు జగన్ ఓటమిపై విచారణ జరపాలని, జగన్‌ను మళ్లీ సీఎంను చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తన భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు.
ఆ యువకుడి వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు యువకుడు ఇలా మాట్లాడాడు ‘నా లాంటి పేదలకు జగనన్న ఎంతో మేలు చేశాడు. ఎంతోమందికి ఉపకారం చేసిన వ్యక్తి ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటీ? ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, మరొకటని.. ఇలా ఏవేవో అంటున్నారు. ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ మాకు న్యాయం జరగాలి. జగనన్న మళ్లీ సీఎం కావాలి. లేదంటే భార్యా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటా. అలా కాకుండా తమను కాపాడేందుకు ఎవరైనా బ్రిడ్జిపైకి వస్తే గోదావరిలో దూకేస్తా. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ ఎన్నికల ఫలితాలపై విచారణ జరిపించి న్యాయం చేయాలి. ఈ వీడియో జగనన్న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పెద్దలందరికీ చేరాలి’ అంటూ కోరాడు. సదరు వ్యక్తిది బ్రాహ్మణగూడెం అని, అతడు జగన్‌కు వీరాభిమాని అని సమాచారం.
జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2024
కొవ్వూరు - అసెంబ్లీ ఎన్నికల్లో వైఎసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి… pic.twitter.com/jJvrbr3j48