జగన్ ఓటమికి కారణం చెప్పిన మందుబాబు.. వీడియో వైరల్

జగన్ ఓటమికి కారణం చెప్పిన మందుబాబు.. వీడియో వైరల్

ఏపీలో వైసీపీ ఓటమికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు. పథకాలు ఎన్ని అమలు చేసినా ఇలా జరిగిందేంటీ అని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఏపీలో వైసీపీ ఓటమికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు. పథకాలు ఎన్ని అమలు చేసినా ఇలా జరిగిందేంటీ అని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమ ఓటమికి కారణాలు వెతికేపనిలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా మరీ 11సీట్లకు పరిమితంకావడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోనూ జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడంతో వారి మనోవేదనను వర్ణించలేనిది.  

అయితే, కూటమి అధికారంలోకి రావడానికి కొందరు జగన్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ మందుబాబు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జగన్ మహిళలను ప్రాధాన్యత ఇచ్చి పథకాలను అమలు చేశారని అందుకే ఆయన ఓడిపోయారని తెలిపాడు. అదే మగవారికి మంచిమందు ఇస్తే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు.

ఆ వీడియోలో ‘జగనన్నా.. నా అక్కచెల్లెళ్లు ఓటేస్తారని చెప్పి అమ్మఒడి ఇచ్చావ్.. చేయూత ఇచ్చావ్.. చేదోడు ఇచ్చావ్.. కాపు నేస్తం ఇచ్చావ్.. ఇన్నిచ్చినా వాళ్లు నీకేం ఇచ్చారు. చివరికి ఓటమినిచ్చారు. అదే మా మగవాళ్లకు నువ్వు మంచి మందు ఇచ్చిఉంటే ఇవాళ నువ్వు ఓడిపోయినా కనీసం 40 నుంచి 50 సీట్లు ఇచ్చేవాళ్లం. నువ్వు ఆడవాళ్లను నమ్మడం వల్లే కేవలం 10సీట్లకే మిగిలిపోయావ్ అన్నా..’ అంటూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Posts