అల్లర్లపై డీజీపీ చేతికి సిట్ నివేదిక.. రిపోర్టులో భయంకర విషయాలు!

అల్లర్లపై డీజీపీ చేతికి సిట్ నివేదిక.. రిపోర్టులో భయంకర విషయాలు!

ఏపీలో పోలింగ్ రోజు నుంచి జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఓ నివేదిక రెడీ చేసి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఇచ్చారు. ఈ రిపోర్టును సీఎస్ జవహార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఈ నివేదికలో సంచలన అంశాలు పొందుపరిచింది. అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న తిరుపతి, అనంతపురం, పల్నాడులో సిట్ బృంద పర్యటించింది. అల్లర్లకు సంబంధించిన చాలా వివరాలను తెలుసుకుంది. అల్లర్లు జరిగిన ప్రదేశాలతో పాటు.. కేసులు నమోదైన పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్లింది. అల్లర్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లను విశ్లేషించింది. అల్లర్లు జరిగి ప్రదేశాల్లో స్థానికులతో మాట్లాడింది. స్థానికులు చెప్పిన విషయాలకు, ఎఫ్ఐఆర్‌లో నమోదైన వివరాలను పోల్చి చూసింది. 

 

అన్ని పరిశీలించి ఓ నివేదక తయారు చేసి డీజీపీకి అందించింది. ఈ అల్లర్లు వెనక మరికొంతమంది ప్రమేయం ఉందని సిట్ అధికారులు గుర్తించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేయాలని సూచించింది. అంతేకాదు.. హింసాత్మక ఘటనలకు భద్రతా వైఫల్యం కూడా మరో ప్రధాన కారణమని గుర్తించింది. అల్లర్లుపై ముందస్తు సమాచారం ఉన్నా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది. కొంతమంది అధికారులు ఏకంగా పలు పార్టీల నేతలతో కుమ్మకయ్యారని గుర్తించారు. అందుకే హింస జరుగుతున్నా చూసి చూడనట్టు వదిలేశారని సిట్ బృందం తెలిపింది. 

 

మొత్తం మూడు జిల్లాల్లోనూ 33 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు గుర్తించింది. ఈ అల్లర్లుపై 150 పేజీల నివేదిక తయారు చేసి డీజీపీకి అందించింది. అంతేకాదు.. ఫలితాలు తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఉద్రిక్తత ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

Tags:

Related Posts