మధ్యతరగతి కుటుంబాలకు బిగ్ షాక్.. పెరిగిన టోల్ ఛార్జీలు

మధ్యతరగతి కుటుంబాలకు బిగ్ షాక్.. పెరిగిన టోల్ ఛార్జీలు

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వాహనదారులకు గట్టి ఝలక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరగనున్న ధరలు జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రతీ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఫీజులను నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా పెంచుతుంది. రహదారుల నిర్వహణ కోసం ఈ ఛార్జీలను పెంచుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఉండటంతో ఛార్జీలు పెంచలేదు. ఎన్నికల సంఘం ఆదేశాలతోనే ఇంత వరకూ పెంచలేదు. 

 

Read More మీ ఆలోచనను స్టార్టప్‌గా మార్చుకునే అవకాశం మిస్ అవ్వకండి! హైడియాథన్ 2025 లో ప్రభావం చూపండి

అయితే.. ఈ ఏడాది ఛార్జీల పెంపును ఉండదని అంతా అనుకున్నారు. కానీ.. ఎన్నికలు ఉండటంతో చార్జీల పెంపు కేవలం వాయిదా వేసుకుంది. జూన్ 1తో సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. దీంతో జూన్ 2 నుంచి ఈ పెంచిన ధరలు అందుబాటులోకి వస్తాయి. అయితే.. ఎన్నికలు మరో రెండు విడతలు ఉండగానే ఛార్జీల పెంపుకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ మేరకు టోల్ ప్లాజా నిర్వాహకులకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. టోల్ ఫీజులను ప్రస్తుతమున్న దానికంటే ఐదు శాతం పెంచనున్నారు. 

 

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. రవాణా ఛార్జీలు పెరగడంతో నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయాయి. టోల్ ప్లాజా ధరలను కూడా పెంచుతుండటంతో ఇప్పుడు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికలు అయిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే.. నిత్యావసరాలు వస్తువులు ఇక కొనే పరిస్థితి కూడా ఉండదు.

Tags: