కాసేపట్లో సీఎం పదవికి జగన్ రాజీనామా!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతోంది. వైసీపీ ఈ ఫలితాల్లో 22 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతోంది. దాదాపు ఎన్డీఏ విజయ ఢాంక మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. కాసేపటి క్రితమే గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. గత 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం వైపు దూసుకు వెళ్తుండగా.. ఈ నెల 9న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది.