కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై రెండు లారీలు ఢీకొన్నాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు నుంచి రొయ్యల లోడ్‌తో వస్తున్న లారీని, పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్న మరో లారీ ఢీకొంది. 

కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు మృతిచెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. మృతుల్లో ఐదుగురిని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులున్నారు. 

Read More త్వరలో ఒకే వేదిక మీదకు చంద్రబాబు, రేవంత్

మరో లారీలో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడున్నారు. ఘటనాస్థలంలో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 4గంటలకు ప్రమాదం జరగగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా