పవన్ గెలుపుపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. ఇలా అనేసిందేంటి..?
పూనమ్ కౌర్ పేరు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు ఏపీ రాజకీయాల్లో ఆమె పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో ఆమె పవన్ కల్యాణ్ మీద చేసిన కామెంట్లు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. అంతగా ఆమె వైరల్ అవుతోంది
పూనమ్ కౌర్ పేరు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు ఏపీ రాజకీయాల్లో ఆమె పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో ఆమె పవన్ కల్యాణ్ మీద చేసిన కామెంట్లు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. అంతగా ఆమె వైరల్ అవుతోంది. ఆమె సినిమాల్లో పెద్దగా పాపులర్ కాలేదు గానీ.. సినిమాలు కాకుండా ఇతర విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు పాపులర్ అవుతోంది.
అప్పట్లో ఆమె వైసీపీ ప్రభుత్వం, జగన్ కు అనుకూలంగా కొన్ని పోస్టులు కూడా షేర్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. కాగా ఇప్పుడు ఆమె తాజాగా ఏపీలో టీడీపీ కూటమి గెలుపుపై స్పందించింది. అయితే ఆమె పోస్టు కూడా ఎవరూ ఊహించని విధంగానే ఉంది. పూనమ్ కౌర్ వైఎస్సార్ సీపీ నినాదం ‘వై నాట్ 175’ పై సెటైరికల్ ట్వీట్ వేసింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్టోరీ పోస్ట్ షేర్ చేసింది. ‘వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు’ అంటూ పోస్ట్ చేసింది.
ఇందుకు ఆమె #andhrapradesh అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. ఇంకేముంది ఈ పోస్టు కాస్తా క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అయితే ఇది చూసిన కూటమి కేడర్, జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. ఆమె జగన్ ను తిట్టిందా లేదంటే కూటమిని తిట్టిందా అనేది అర్థం కావట్లేదని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఒకప్పుడు ఆమె జగన్ అప్పట్లో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించడంతో.. ఇప్పుడు ఆమెకు పంచ్ పడింది అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.