పవన్ తనయుడు అకిరా స్పెషల్ పోస్ట్

పవన్ తనయుడు అకిరా స్పెషల్ పోస్ట్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ, మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ, మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, మెగా ఫ్యామిలీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ తనయుడు అకిరా నందన్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసాడు. 

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసి సెల్యూట్ ది కెప్టెన్ అని పోస్ట్ చేసాడు. నిజానికి అకిరా నందన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏంటో ఎవరికీ తెలీదు. అకిరా చాలా పర్సనల్‌గా తన సోషల్ మీడియా అకౌంట్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. దాన్ని స్క్రీన్ షాట్ చేసిన రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి అకిరా అకౌంట్, ఆ పేరు కనబడకుండా జాగ్రత్త పడింది. అకిరా తన నాన్న గెలుపుపై పోస్ట్ చేసాడు అంటూ రేణూదేశాయ్ రాసుకొచ్చింది. 

Read More చెత్త రిక్షా ను ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ సుజాత

దీంతో రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మరి అకిరా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏంటో అని పవన్ అభిమానులు వెతికే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారు. అసెంబ్లీ 21స్థానాల్లోనూ, లోక్ సభ రెండు స్థానాల్లోనూ జనసేన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి దాదాపు 70 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

https://www.instagram.com/stories/renuudesai/3383048210754059018?igsh=YXVwMW9hcHF3emN2

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా