చంద్రబాబుకు ఎన్టీఆర్, చరణ్, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

చంద్రబాబుకు ఎన్టీఆర్, చరణ్, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కూటమి విజయంపై పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ యంగ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. 

ఎక్స్ వేదికగా ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

Read More మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత

అదేవిధంగా మరో ట్వీట్‌లో ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘దార్శనికుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారు’ అంటూ రాసుకొచ్చాడు. అదేవిధంగా టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ చంద్రబాబు గెలుపు పట్ల స్పందిస్తూ ‘ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి సభ్యులందరికీ విజయాభినందనలు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లకు ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్నారు. 

అదేవిధంగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. ‘ ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఏపీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా గాయని స్మిత.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది.

Advertisement

LatestNews

బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా.. మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.
పిల్లి శ్రీనివాస్  సభ్యత్వానికే  దిక్కులేదు   -మున్నూరు కాపు మహాసభ 
భద్రాచలం దేవస్థానానికి ఆదర్శ నేత – ఎల్. రమాదేవి
ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరు వేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం
శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య