Nellore: పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం.. యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి..! 

Nellore: పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం.. యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి..! 

నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరు యాదవపాలెంకు చెందిన యువతికి దగ్గరి బంధువైన వింజమూరు గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. 

ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తాను ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరు యాదవపాలెంకు చెందిన యువతికి దగ్గరి బంధువైన వింజమూరు గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. 

తనను పెళ్లి చేసుకోవాలంటూ చాలా కాలంగా ఆమె వెంట తిరుగుతున్నాడు. ఇరువురికీ బంధుత్వం ఉండటంతో యువకుడిని వివాహం చేసుకునేందుకు సదరు యువతి నిరాకరించింది. అయినా వెనక్కి తగ్గని యువకుడు చాలాసార్లు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె స్పందించలేదు. ఈ క్రమంలో యువతికి వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకుని నాగార్జున కోపోద్రిక్తుడయ్యాడు. ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమె పై కత్తితో దాడి చేశాడు. 

అడ్డు వచ్చిన యువతి తల్లిపైనా దాడికి ఒడిగట్టాడు. దీంతో ఇరువురికీ తీవ్రగాయాలయ్యాయి. ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. అయితే, బాధితులు గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి రావడంతో నాగార్జున పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన తల్లీ.. కూతుళ్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Related Posts