మోడీ నాతో చెప్పింది ఇదే.. చిరంజీవి వివరణ..

మోడీ నాతో చెప్పింది ఇదే.. చిరంజీవి వివరణ..

 

మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాగా ఏపీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ చేతులను మోడీ తన చేతిలో పట్టుకుని ప్రజలకు అభివాదం చేసిన వీడియోలు, ఫొటోలు చూడటానికి రెండు కండ్లు చాలలేదు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

అంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదే స్టేజిమీద చిరంజీవి, పవన్ కల్యాణ్‌ లతో మోడీ ప్రత్యేకించి మాట్లాడారు. దాంతో అసలు మోడీ వారిద్దరితో ఏం చెప్పాడా అని అందరిలోనూ ఆసక్తి ఉంది. కాగా తాజాగా దానిపై స్పందించాడు చిరంజీవి. పవన్ కల్యాణ్‌ గెలిచిన తర్వాత నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు. పవన్ కు ఘన స్వాగతం పలికింది మెగా ఫ్యామిలీ. 

అంతే కాకుండా చిరంజీవి కాళ్లు మొక్కాడు పవన్ కల్యాణ్‌. ఈ వీడియో బాగా వైరల్ అయింది. స్టేజి మీద చిరంజీవితో నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఆ వీడియో చూసినేను చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పారంట. ఆ వీడియో చూస్తే ప్రత్యేకించి పవన్ చిరు మధ్య వున్న ప్రేమానుబంధాలు కనిపించాయని అన్నారంట. అంతే కాకుండా భారత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేశారంటూ తెలిపారంట నరేంద్ర మోడీ. దాన్ని చిరంజీవి ట్వీట్ చేస్తూ వివరించారు.

Related Posts