చంద్రబాబుకు బీజేపీ రెండు కుక్క బిస్కెట్లు వేసింది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబుకు బీజేపీ రెండు కుక్క బిస్కెట్లు వేసింది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!

 

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. ఇందులో టీడీపీ పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇటు ఏపీలో కూడా త్వరలోనే ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ఇందులో ఆయన మాట్లాడుతూ.. తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ను ఇండియా కూటమిలో చేరమని చెప్పానని.. అలా చేసి ఉంటే ప్రధాని పదవితో పాటు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కూడా వచ్చి ఉండేదని.. కానీ వారు వినలేదని తెలిపారు. చంద్రబాబు బీజేపీ మాయలో పడ్డారని చెప్పారు. 

చంద్రబాబుకు బీజేపీ రెండు కేంద్ర మంత్రి పదవులను కుక్క బిస్కెట్ల రూపంలో వేసిందని.. దాంతో వెంటనే చంద్రబాబు మోడీకి సపోర్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ చంద్రబాబుకు నిజాయితీ ఉంటే.. స్పెషల్ స్టేటస్ ఇచ్చే వరకు కేంద్ర మంత్రి పదవులు తీసుకోకుండా చూడాలని.. అప్పుడే అనుకున్నది సాధ్యం అవుతుందని తెలిపారు.

Related Posts