ఏ ఫైల్ బయటకు వెళ్లొద్దు.. ఏపీ పోలీస్ అధికారులకు ఆదేశాలు!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా సాగుతోంది. దీంతో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా సాగుతోంది. దీంతో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు భద్రత పెంచారు. అలాగే ఆయనకు కాన్వాయ్ సిద్ధం చేయమని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం ఆపీస్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకున్నట్లు తెలిసింది. 2019 - 2024 నుంచి ఇప్పటి వరకు ఏ ఫైల్‌లను బయటికి పోకూడదని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో.. వైసీపీ అధికారంలో అవకతకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ అధికారంలో ఉన్న ఏ ఫైల్స్ కూడా బయటకు వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు.