అన్నగా గర్వంగా ఉంది.. పవన్‌కు చిరు విషేస్

అన్నగా గర్వంగా ఉంది.. పవన్‌కు చిరు విషేస్

నీ కలల్ని నెరవేర్చుకున్నావు

ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలుసు

ప్రజల సంక్షేమం వైపు నిన్ను నడిపిస్తోంది

పవన్‌కు చిరు ఎక్స్‌ వేదికగా విషేస్

ఒక అన్నగా చాలా గర్వంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన 70 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. దీంతో ఈసారి పిఠాపురం నుంచి మెజారిటీతో గెలిచి మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీంతో ఆయన గెలుపుపై చిరంజీవి స్పందిస్తూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిజజేశారు. ‘డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ చేంజర్‌వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ  కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని అంటూ’ చిరంజీవి ట్వీట్ చేశారు.

 

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

 

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

Related Posts