రైతులకు గుడ్ న్యూస్.. నైరుతి రుతపనాలు అప్డేట్
ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే రుతుపవనాలు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని ప్రకటించింది. దీంతో.. నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమవుతాయని ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఐఎండీ ఆ అంశంపై క్లారిటీ ఇచ్చింది. రుతుపవనాలు ఆలస్యమయ్యే సూచనలు ఏమీ కనిపించడం లేదని అధికారుల ప్రకటించారు.
నైరుతి రుతుపనాలు మొదట బంళాఖాతానికి ఈశాన్యంగా ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలను తాకుతాయి. ప్రతీ ఏటా ఈ ప్రక్రియ మే 18–20 తేదీల్లో మధ్యలో జరుగుతోంది. ఇప్పటికే ఈ ఏడాది నికోబార్ దీవుల దిశగా రుతుపవనాలు కదులుతున్నాయని ఐఎండీ ప్రకటించింది. దీంతో అనుకున్న సమయానికే రుతుపవనాలు కేరళను తాకుతాయని తెలిపింది.
ఇక.. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని ప్రకటించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మే 24 నాటికి అది వాయుగుండంగా మారి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు IMD తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడకక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.