డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పోలీసుల గౌరవ వందనం
- పవన్ కల్యాణ్‌కు పోలీసుల గౌరవ వందనం
- విజయవాడలోని క్యాంపు కార్యాలయ భవనం పరిశీలన
- బిల్డింగ్‌పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో ఆఫీస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు పోలీసులు గౌరవ వందనం చేశారు. ఇవాళ (మంగళవారం) గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో దిగిన పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నేరుగా జలవనరుల శాఖ అతిథిగృహానికి చేరుకున్నారు. కాగా, అధికారులు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు.
అయితే, పవన్ విజయవాడలో పర్యటనలో భాగంగా తనకోసం ఏర్పాటు చేస్తున్న క్యాంపు కార్యాలయం భవనాన్ని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించి, అవసరమైన మార్పులు సూచించారు. బిల్డింగ్‌పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఆ తర్వాత పవన్ అక్కడి నుంచి నేరుగా జనసేన కార్యాలయం చేరుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయంకు వెళతారని, అక్కడ తన పేషీని పరిశీలిస్తారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.