శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!

శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల వెళ్లిన సీఎం కుటుంబానికి టీడీపీ అధికారులు ఘన స్వాగతం పలికారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మనవడి పుట్టు వెంట్రుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎలాంటి హడావిడి లేకుండా స్వామివారి దర్శినానికి సింపుల్‌గానే వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల వెళ్లారు. 

 

Read More వరంగల్ క్లబ్ లో  ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన:ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ

అయితే మార్చి నెల నుంచి ఎన్నికల కోడ్‌ అమలుతో ఆగిపోయిన వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను మళ్లీ స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలో పోలింగ్‌ ముగియడంతో.. తిరిగి తిరుమలలో వీఐపీల సిఫార్సు బ్రేక్‌ టికెట్ల జారీకి అనుమతించాలని టీడీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ అభ్యర్థనను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌.. వెంటనే సానుకూలంగా స్పందించింది. వీఐపీ బ్రేక్‌ దర్శనంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌...కుటుంబసభ్యులతో కలిసి గోవిందుడిని దర్శించుకున్నారు.

 

Read More వరంగల్ క్లబ్ లో  ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన:ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ

దర్శనం తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలుండాని స్వామివారికి కోరుకున్నట్టు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం తరుఫున సహకారం అందిస్తామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.

Tags: