ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అక్కడ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలతో చర్చించనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. 

ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2గంటలకు వారు అక్కడికి చేరుకుంటారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. బిహార్ నుంచి నితీశ్ కుమార్ సైతం పాల్గొననున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు కీలకం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజీపీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు మద్దతు తెలపనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 6గంటలకు వారి తిరిగి విజయవాడ చేరుకుంటారు. 

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

ఈసారి బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం తప్పనిసరి అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్, బిహార్‌ల నుంచి చంద్రబాబు, నితీశ్ కుమార్‌ల మద్దతు మోదీకి చాలా అవసరం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి 31 సీట్లు అవసరం. దీంతో మిత్రపక్షాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఏపీలోని కూటమికి చెందిన 21లోక్ సభ సీట్లు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.