శాఖల నిర్ణయం మోడీకే.. చంద్రబాబు కీలక నిర్ణయం..

శాఖల నిర్ణయం మోడీకే.. చంద్రబాబు కీలక నిర్ణయం..

టీడీపీకి ఏ శాఖ ఇవ్వాలన్నా మోడీ చేతిలోనే
కీలక శాఖలే ఇస్తారని భావిస్తున్న టీడీపీ

విశ్వంభర, విశాఖపట్నంః కేంద్రంలో ఇప్పుడు ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పుడు చంద్రబాబు కీలకంగా మారిపోయారు. ఆయన వల్లే మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు కేంద్రంలో కీలక పాత్ర లభించబోతోందని తెలుస్తోంది. 

ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీకి కనీసం మూడు కేంద్ర మంత్రి పదవులు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగా కేంద్ర మంత్రి శాఖలను మాత్రం మోడీకే వదిలేస్తున్నారంట చంద్రబాబు. టీడీపీకి ఏ మంత్రి శాఖలను ఇవ్వాలనేది మోడీ నిర్ణయానికే వదిలేస్తున్నామని చంద్రబాబు ఇప్పటికే ఎన్డీయే పెద్దలకు తెలియజేశారంట.

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

మోడీ కూడా చంద్రబాబు ప్రాధాన్యతను తగ్గించకుండా.. కీలక శాఖలే ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సారి బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎన్డీయే మిత్రపక్షాలకు డిమాండ్ పెరిగింది. అందుకే మోడీ మిత్ర పక్షాల డిమాండ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.