ఏపీలో బాణసంచా విక్రయాలపై నిషేధం..!

ఏపీలో బాణసంచా విక్రయాలపై నిషేధం..!

ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది.

ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 
 
మరోవైపు ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కౌంటింగ్ సమయం దగ్గర పడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. 20 మందిపై రౌడీ షీట్స్, 55 మందిపై సస్పెన్షన్ షీట్స్ దాఖలు అయినట్లు పోలీసులు తెలిపారు. 14 మంది అరెస్ట్, నలుగురికి CRPC నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు.

Related Posts