ఏపీ మంత్రులకు అసెంబ్లీ ఫలితాల్లో షాక్..! 

ఏపీ మంత్రులకు అసెంబ్లీ ఫలితాల్లో షాక్..! 

ఏపీ ప్రజలు అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో ముందంజలో ఉన్నారు. వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు. కూటమి 158 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఏపీ ప్రజలు అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో ముందంజలో ఉన్నారు. వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు. కూటమి 158 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో పాటుగా జనసేన పోటీ చేసిన 21 స్థా్నాల్లో 19 స్థానాల్లో ముందంజలో ఉంది. జగన్ మినహా మిగిలిన మంత్రులందరూ ఓటమి అంచుల్లో ఉన్నారు.

వైఎస్ జగన్ మినహా ఆయన మంత్రివర్గంలోని మంత్రులంతా ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ మంత్రులపై ఉన్న అవినితీ ఆరోపణలు వీరి ఓట్లపై భారీ ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. నిధులు పంపిణీపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టపోవడం వంటి పలు కారణాలతే వైసీపీ మంత్రులను ప్రజలు దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

ఓటమి దిశగా వెళ్తున్న వారి జాబితాలో బొత్స సత్యన్నారాయణ, మేరుగ నాగార్జున, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్థన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, పీడిక రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, ఆది మూలపు సురేష్‌లు ఉన్నారు. వీరింతా వైసీపీ హయాంలో మంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే.

Related Posts