AP: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు.. పల్నాడుకు కొత్త కలెక్టర్ నియామకం..!
On
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు నూతన ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు నూతన ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్దన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలిలను నియమించినట్లు ప్రకటించింది.
అదేవిధంగా పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్‌ను కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈసీ దీనిపై కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.
Read More రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు