పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి
విశ్వంభర, త్రిపురారం :- త్రిపురారం స్థానిక మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పలు ప్రభుత్వ శాఖలలో ఆయా శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నందు కే. విజయ కుమారి, గ్రామపంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శి కోడి రెక్క రాజేందర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ మాలోత్ సంజయ్ అధికారులు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులు అర్పించి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయా శాఖల్లోని అధికారులు మాట్లాడుతూ.. అంబేద్కర్ గారు సాధించిన పలు అంశాలు , సేవలు భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో త్రిపురారం పంచాయతీ సెక్రెటరీ కోడిరెక్క రాజేందర్, ఆఫీస్ సిబ్బంది, ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గోపాల్ రెడ్డి, ఎ ఎన్ ఎం లు,పలువురు నర్సులు పలువురు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



